శానిటైజెర్ తాగుతున్న ఘటనలపై పోలీసులు అలెర్ట్..!!
ప్రకాశం జిల్లా గిద్దలూరు లో సీఐ సుధాకరరావు గిద్దలూరు లోని పలు మెడికల్ షాపులను తనిఖీ చేశారు. కంభంలో ఎస్సై మాధవరావు కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర రావు మెడికల్ షాప్ నిర్వాహకులతో శానిటైజర్ లు కొనుగోలుకు వస్తున్నవారి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అలానే మద్యం తాగుతూ ఉండే వారిని గుర్తించడం పెద్ద విషయమేమీ కాదని.., ఎక్కువసార్లు కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించి, స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలన్నారు. నిన్న గిద్దలూరు లో ముగ్గురు శానిటైజర్ లు తాగుతుండగా వారిని గుర్తించి SEB అధికారుల సహాయంతో వారిని పట్టుకున్నామని అలానే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.
★ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఇచ్చిన ఆదేశాలతో మెడికల్ షాపులు తనిఖీలు చేసినట్లుగా సిఐ తెలిపారు.
★ అలానే మద్యానికి బానిసైన వారు శానిటైజర్ ఎవరు తాగవద్దని ఇటీవల కురిచేడు లో 16 మందికి పైగా మృతి చెందారని అనవసరంగా శానిటైజర్ లు తాగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
* కంభంలో ఎస్సై మాధవరావు కూడా మెడికల్ షాపులు తనిఖీ చేశారు.